Minister G Kishan Reddy: నా విజయం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అంకితం..
ABN, Publish Date - Jun 22 , 2024 | 11:52 AM
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి(Minister G Kishan Reddy) అన్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి(Minister G Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కార్యకర్తలు అంకితభావంతో తన గెలుపునకు పని చేశారని, ప్రజలు కూడా అదేస్ఫూర్తితో తనకు ఓట్లేసి గెలిపించారన్నారు. శుక్రవారం రాత్రి బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో బీజేపీ(BJP) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కార్యాలయానికి రావడంతో మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు.
ఇదికూడా చదవండి: Hyderabad: సైబరాబాద్‌లో 27మంది ఎస్ఐల బదిలీ..
అనంతరం ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంటరీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గం ప్రజలు మరొకసారి మెజార్టీ అందించి విజయంలో ప్రధానపాత్ర పోషించారన్నారు. అంబర్‌పేట నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీమంత్రి కృష్ణయాదవ్, పలువురు బీజేపీ నాయకలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ..
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 22 , 2024 | 11:52 AM