Share News

Minister Tummala: ఆయిల్‌ పామ్‌ బకాయిలు 100 కోట్లు విడుదల

ABN , Publish Date - Jun 19 , 2024 | 07:54 AM

ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులు, కంపెనీలకు సంబంధించిన బకాయిలు రూ. 100.76 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు.

Minister Tummala: ఆయిల్‌ పామ్‌ బకాయిలు 100 కోట్లు విడుదల

- ఆయిల్‌ పామ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్: ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులు, కంపెనీలకు సంబంధించిన బకాయిలు రూ. 100.76 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఈ నిధులతో రెండు, మూడు రోజుల్లో ఆయిల్‌ పామ్‌ తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకు సంబంధించిన రాయితీలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్యానశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇదే క్రమంలో 2022-23 నుంచి పెండింగ్‌లో ఉన్న సూక్ష్మ సేద్యానికి సంబంధించిన రూ. 55.36 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తుమ్మల వెల్లడించారు.


అయిల్‌ పామ్‌, ఇతర పంటల్లో రైతులు అమర్చిన సూక్ష్మ సేద్య పరికరాల కంపెనీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిల కింద వీటిని జమ చేస్తున్నట్లు తెలిపారు. 2023-24 సంవత్సరానికిగాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పాత బకాయులు ఇప్పుడు విడుదల చేసిన నేపథ్యంలో... 2024-25 సంవత్సరానికి గాను ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాన్ని రైతులు చేరుకునేలా ప్రోత్సహించాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 07:54 AM