ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన 108 సిబ్బంది

ABN, Publish Date - Nov 22 , 2024 | 12:07 AM

సీపీఆర్‌ చేసి 108 వాహన సిబ్బంది ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో గురువారం ఈ సంఘఘటన జరిగింది.

భువనగిరి అర్బన, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సీపీఆర్‌ చేసి 108 వాహన సిబ్బంది ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో గురువారం ఈ సంఘఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు చెందిన సిద్ధులు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబసభ్యులు అప్రమత్తమై వెంటనే 108 అంబులెన్సకు సమాచారం అందించారు. ఈ మేరకు తుర్కపల్లికి చెందిన వాహనం గ్రామానికి చేరుకోగానే ఎలాంటి హృదయ స్పందన లేకుండా స్పృహ తప్పి పడిన సిద్ధులును గమనించిన 108ఈఎంటీ అంబేడ్కర్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు. విలువైన ప్రాణాలు కాపాడి ఆసుపత్రికి తరలించిన 108పైలెట్‌ రాకేష్‌, ఈఎంటీ అంబేడ్కర్‌, సిబ్బందిని జిల్లాఆసుపత్రి డీఎంవో విష్ణు, కుటుంబసభ్యుల సమయస్ఫూర్తికి అభినందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Nov 22 , 2024 | 12:07 AM