బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబు
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:18 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 12: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థాన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఉత్సవాల విశేషాలను ప్రచారం చేసే ప్రచార రథాలు ఇప్పటికే జిల్లాలకు వెళ్లగా, ప్రచార వాల్‌పోస్టర్లను విస్తృతంగా పంపిణీచేశారు. గుట్టపైన స్వామి వారి ప్రధాన కార్యాలయంతో పాటుగా ఇతర దర్శనీయ స్థలాలు, ఉపాలయాలు, గుట్ట కింద అమ్మవారి ఆలయ ప్రాంగణాలను రంగులతో తీర్చిదిద్దే పనులు పూర్తి కావస్తున్నాయి.
ఇవీ బ్రహోత్సవాల విశేషాలు
వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు భక్తులను విశేషంగా అలరించనున్నాయి. ఈ నెల 14వ తేదీన నల్లగొండలో నగరోత్సవం, 16న గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభించే 16వ తేదీ రాత్రి (తెల్లవారితే 17న) స్వామి వారి కల్యాణోత్సవం, 17 రాత్రి (తెల్లవారితే 18) అగ్నిగుండాలు, 18 రాత్రి (తెల్లవారితే 19)న దోపోత్సవం, అశ్వవాహన సేవ, 20న పుష్పోత్సవం, 21వ తేదీన గజవాహన సేవతో ఉత్సవాలు ముగిస్తారు.
Updated Date - Feb 13 , 2024 | 12:18 AM