ప్రాణవాయువులా పనిచేయాలి
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:06 AM
పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించడం అంటే ప్రజలకు సేవ చేయడమేనని, ప్రజలకు సమర్థమైన సేవలందిస్తూ ప్రాణవాయువులా పనిచేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు
డీటీసీలో ముగిసిన ఏఆర్ పీసీల పాసింగ్ అవుట్ పరేడ్
ఆకట్టుకున్న ఏఆర్ పీసీల కవాతు
నల్లగొండ క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించడం అంటే ప్రజలకు సేవ చేయడమేనని, ప్రజలకు సమర్థమైన సేవలందిస్తూ ప్రాణవాయువులా పనిచేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు.ఈ శాఖలో ఉద్యోగం అదృష్టంగా భావించి అంకిత భావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కేం ద్రంలో తొమ్మిది నెలలుగా శిక్షణ పొందిన సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన 265 మంది ఏఆర్ ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు నిర్వహించిన బేసిక్ ఇండెక్షన ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఆయనకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు శరత చంద్ర పవార్, సన ప్రీతసింగ్‌లు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీ్‌సశాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉన్నప్పుడే ఎలా ంటి సవాళ్లనైనా ఎదుర్కోగలమన్నారు. శిక్షణ అనంతరం కూడా ప్రతి రోజూ వ్యాయామం చేసి ధృడ ంగా ఉండాలన్నారు. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, ఇప్పుడు పొందిన శిక్షణ సర్వీస్ పూర్తయ్యేంత వరకూ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రదర్శించిన పరేడ్ ఆకట్టుకుంది.కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ రమేష్, అడ్మిన ఏఎస్పీ రాములునాయక్, డీటీసీ డీఎస్పీ విఠల్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు డానియల్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, దూది రాజు, ఆర్‌ఐలు హరిబాబు, శ్రీను, సంతోష్, ఎస్‌ఐలు బాబు, ప్రవీణ్, శ్రీనివాస్, భరత, ఆర్‌ఎ్‌సఐలు అఖిల్ చంద్ర, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఆనందంగా గడుపుతూ..
శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ పీసీలు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుని కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నారు. సోదరుడి క్యాప్‌లను ధరించి చెల్లెళ్లు సంతోషంలో మునిగిపోయారు. శిక్షణ కోసం తొమ్మిది నెలలుగా ఇంటికి దూరంగా ఉండటంతో ఇంటి నుంచి భోజనాన్ని తీసుకువచ్చి కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేసి జ్ఞాపకాలను పంచుకున్నారు. 265 మంది ఏఆర్ పీసీల శిక్షణ ముగింపు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో సందడి నెలకొంది.