Share News

రామాపురం బ్రిడ్జి మరమ్మతులు ముమ్మరం

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:06 AM

గత వరదలకు కుంగిన మండలంలోని రామాపురం వద్ద ఉన్న అంత్రరాష్ట్ర బ్రిడ్జికి మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

రామాపురం బ్రిడ్జి మరమ్మతులు ముమ్మరం
రామాపురం బ్రిడ్జి చివరలో ఎక్స్‌కవేటర్‌తో తీస్తున్న గుంత

నెల రోజుల్లో పూర్తి చేసేలా ఒప్పందం

గత వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జి చివరి భాగం

కోదాడ రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : గత వరదలకు కుంగిన మండలంలోని రామాపురం వద్ద ఉన్న అంత్రరాష్ట్ర బ్రిడ్జికి మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు నెలల కిందట వరదలతో పాలేరు వాగు ఉధృతికి జిల్లా సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్డు కోతకు గురైంది. దీంతో అధికారులు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఒక వైపు నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద సమయాల్లో మరోసారి ఇలా పరిస్థితి తలెత్తకుండా నేషనల్‌ హైవే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రిడ్జిని కింది నుంచి సుమారు 80 మీటర్ల లోతు నుంచి కాంక్రీట్‌తో పటిష్ఠంగా పనులు ప్రారంభించారు. ఈ కాంక్రీట్‌ పనులను చేజిక్కిచుకున్న ఆర్‌హెచఎ్‌స సంస్థ వారంరోజులుగా బ్రిడ్జి వద్ద ఎక్స్‌కవేటర్లతో బ్రిడ్జి అవతలి వైపు 80 మీటర్ల లోతు వరకు గుంతలు తీసి పనులు చేపడుతోంది. బ్రిడ్జికి ఇరువైపులా ఆంధ్రా, తెలంగాణ వైపులా స్వల్పంగా దెబ్బతినడంతో కాంక్రీట్‌ పనులు చేపడుతున్నారు. పనులను నెలరోజుల్లో పనులు పూర్తి చేసేలా సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. గతంలో హైదరాబాద్‌ నుంచి నందిగామ వరకు రోడ్డు నిర్మించిన జీఎంఆర్‌ సంస్థ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 65వ నెంబర్‌ జాతీయ రహదారి నిర్వహణ బాధ్యలను జాతీయ నేషనల్‌ హైవే అధికారులు చేపట్టారు. కోతకు గురై రాకపోకలు నిలిచి రెండు నెలలు దాటినా ఇప్పుడు పనులు చేపట్టడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:06 AM