Share News

దివ్యాంగులకు గుట్టలో దుకాణాలు కేటాయించాలి

ABN , Publish Date - Feb 21 , 2024 | 12:49 AM

యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణంలోని దుకాణాలను దివ్యాంగులకు కేటాయించాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గత్తికొండ కిరణ్‌ డిమాండ్‌ చేశారు.

దివ్యాంగులకు గుట్టలో దుకాణాలు కేటాయించాలి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20: యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణంలోని దుకాణాలను దివ్యాంగులకు కేటాయించాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గత్తికొండ కిరణ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘం నాయకులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వారు దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న అనంతరం దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఈవో రామకృష్ణారావును కలిసి వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దైవదర్శనాలకు వచ్చే దివ్యాంగులకు స్వయంభువుల దర్శనాలు వెంటనే కల్పించడంతో పాటు తగినన్ని వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట సంఘం జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజు, కన్వీనర్‌ బండ జహంగీర్‌, ప్రధానకార్యదర్శి మీసాల సుధాకర్‌, కార్యదర్శి ఇప్పల రవి, మహిళా అధ్యక్షురాలు మీసాల శోభ, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ, నాయకులు తుమ్మల రవి, పల్లపు ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2024 | 12:49 AM