ప్రత్యేక అధికారులు సమర్ధంగా పని చేయాలి
ABN , Publish Date - Feb 04 , 2024 | 12:24 AM
ప్రత్యేక అధికారులు ప్రతీ పంచాయతీలో సమర్ధంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క
భువనగిరి అర్బన్, మోత్కూరు, ఫిబ్రవరి 3: ప్రత్యేక అధికారులు ప్రతీ పంచాయతీలో సమర్ధంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియాతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ప్రతీ గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 7నుంచి 15వ తేదీవరకు ప్రతీ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలన్నారు. గ్రామాల్లో సర్పంచుల ప దవీకాలం ముగిసినందున మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరి గేవరకు ప్రత్యేక అధికారులు కొనసాగుతారని తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపా రు.కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ జిల్లాలో 421పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించిన ట్లు, ఈనెల 7వ తేదీ నుంచి 15వతేదీ వరకు పారిశుధ్య స్పె షల్ డ్రైవ్ చేస్తున్నట్లు, ముందుగానే ప్రత్యేకంగా ఒరియంటేషన్ నిర్వహించినట్లు తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్‌లో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జడ్పీ సీఈవో సి.హెచ్ కృష్ణారెడ్డి, డీఆర్డీవో టి.నాగిరెడ్డి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఇంజనీర్లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రత్యేక అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల ప్రత్యేక అధికారులు వీక్షించారు. కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్ డి.రాంప్రసాద్, ఎంపీడీవోలు పి.మనోహర్‌రెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు. ప్రత్యేక అధికారులకు ఈ నెల 4న జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు.