వ్యర్థ రసాయనాల ట్యాంకర్ పట్టివేత
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:52 PM
మండల పరిధిలోని కెమిక్లైస్ ఇండస్ర్టీస్ పరిశ్రమ నుంచి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ ద్వారా తరలిస్తుండగా దోతిగూడెం గ్రామస్థులు బుధవారం సాయంత్రం పట్టుకుని పొల్యూషన కంట్రోల్ బోర్డు(పీసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు.
భూదానపోచంపల్లి, జూన 12: మండల పరిధిలోని కెమిక్లైస్ ఇండస్ర్టీస్ పరిశ్రమ నుంచి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ ద్వారా తరలిస్తుండగా దోతిగూడెం గ్రామస్థులు బుధవారం సాయంత్రం పట్టుకుని పొల్యూషన కంట్రోల్ బోర్డు(పీసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ శాస్త్రవేత్త పురుషోత్తంరెడ్డి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్ గ్రామం నుంచి తరలిస్తుండగా పట్టుకున్న గ్రామస్థులు గతంలోనూ అనేక పర్యాయాలు తాము పీసీబీ అధికారులకు, పోలీసులకు ఫి ర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్ కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలను గాలిలోకి, భూగర్భంలోకి వదులుతున్నందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇక్కడి కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంపిల్స్ లేబొరేటరీకి పంపించి రిపోర్టు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని పీసీబీ శాస్త్రవేత్త పురుషోత్తంరెడ్డి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు.