ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:31 AM
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెం చాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. సోమవారం తుర్కపల్లి, పెద్దతం డా, మాదాపూర్, బొమ్మలరామారం మండల కేంద్రంతోపాటు నాగినేనిపల్లి, మైలారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
కలెక్టర్ హనుమంతరావు
తుర్కపల్లి, బొమ్మలరామారం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెం చాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. సోమవారం తుర్కపల్లి, పెద్దతం డా, మాదాపూర్, బొమ్మలరామారం మండల కేంద్రంతోపాటు నాగినేనిపల్లి, మైలారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలన్నారు. ఏమై నా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బొమ్మలరామారం పీఎసీఎస్ సీఈవో జహేందర్ విధులకు అనధికారికంగా గైర్హాజరుకావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి సురేశ్, తహసీల్దార్లు దేశ్యానాయక్, శ్రీనివాసరావు ఉన్నారు.
సర్వే వివరాలన్నీ గోప్యమే
భువనగిరి టౌన్, తుర్కపల్లి నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇంటింటా కుటుంబ సర్వే వివరాలన్నిటినీ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. సోమవారం భువనగిరి, తుర్కపల్లిలో సాగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు.పూర్తయిన సర్వే ఫారాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మునిసిపల్ కమిషనర్ పి.రామాంజుల్‌రెడ్డి, ఎంపీడీవో ఝూన్సీలక్ష్మిబాయి ఉన్నారు.
విద్యావ్యవస్థకు మూలం అబుల్ కలాం
(ఆంధ్రజ్యోతి, భువనగిరి (కలెక్టరేట్)): దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహానీయుడు మౌ లానా అబుల్‌కలాం ఆజాద్ అని కలెక్టర్ హనుమంతరావు కొనియాడారు. అబుల్‌కలాం జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు.