Share News

ఎమర్జెన్సీని తలపించేలా

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:07 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలకు హద్దు లేకుండాపోయిందని ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగుతుందని రాజ్య సభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

ఎమర్జెన్సీని తలపించేలా
విలేకరులతో మాట్లాడుతున్న లింగయ్యయాదవ్‌

రేవంతరెడ్డి పాలన

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్‌

సూర్యాపేటఅర్బన, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలకు హద్దు లేకుండాపోయిందని ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగుతుందని రాజ్య సభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు బాంబులు పేలుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు ఉద్యమపార్టీ బీఆర్‌ఎస్‌ భయపడేది లేదన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ చరిత్రనే తిరగరాశారని గుర్తుచేశారు. సీఎం రేవంతరెడ్డి భాష మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ఉప్పల ఆనంద్‌, నెమ్మాదిబిక్షం, తూడి నర్సింహారావు, బండారిరాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:07 AM