Hyderabad: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నారాయణ రికార్డ్
ABN , Publish Date - Jun 10 , 2024 | 03:47 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో సందేష్ భాగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్ మిశ్రా (6వ ర్యాంకు), ఎం. బాలాదిత్య (11వ ర్యాంకు), రాఘవ్ శర్మ (12వ ర్యాంకు), బిస్మిత్ సాహు (16వ ర్యాంకు), ఆర్యన్ ప్రకాశ్ (17వ ర్యాంకు), అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించారు.
వివిధ కేటగిరీల్లో 6 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు
ఓపెన్ కేటగిరీలో 20 లోపు 7 ర్యాంకులు నారాయణవే
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో సందేష్ భాగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్ మిశ్రా (6వ ర్యాంకు), ఎం. బాలాదిత్య (11వ ర్యాంకు), రాఘవ్ శర్మ (12వ ర్యాంకు), బిస్మిత్ సాహు (16వ ర్యాంకు), ఆర్యన్ ప్రకాశ్ (17వ ర్యాంకు), అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు.. 27, 28, 31, 33, 40, 45, 49, 51, 54, 59, 63, 66, 70, 74, 76, 77, 82, 85, 87, 89, 90, 91, 94, 99 తదితర 100 లోపు 31 ర్యాంకులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డా.పి. సింధునారాయణ, పి. శరణినారాయణ తెలిపారు. అలాగే వివిధ కేటగిరీలలో ఎం. బాలాదిత్య ఓబీసీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, శ్రీచరణ్ పీడబ్ల్యూడీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, రాఘవ్ శర్మ జనరల్-ఈడబ్ల్యూఎస్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, బిబస్వాన్ బిస్వాస్ ఎస్సీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, సుముఖ్ ఎస్టీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, గుండా జ్యోష్మిత జనరల్ పీడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఆలిండియాతో ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు వారు పేర్కొన్నారు.
మొత్తం 6 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో విద్యార్థులు సత్తా చాటారని వెల్లడించారు. ఐఐటీ సీట్ల ఆశయాలను సాకారం చేయడంలో మరెవరూ నారాయణ విద్యాసంస్థలకు సాటిలేరని పేర్కొన్నారు. అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్‌లు, బెస్ట్ స్టడీ మెటీరియల్, నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతోనే ఇంతటి ఘన విజయాలను సాధించినట్లు వారు తెలిపారు.