Telangana Bhavan: నా పంచాయతీ అంతా ఆయనతోనే.. పాడి కౌశిక్ రెడ్డి సంచలనం
ABN , Publish Date - Oct 30 , 2024 | 03:53 PM
సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తన పంచాయితీ అనిల్ కుమార్‌తో కాదని, సీఎం రేవంత్ రెడ్డితోనే కౌశిక్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షకు రావాలని నేను సవాల్ చేశాను. కాంగ్రెస్ నేతలు మాకు చెప్పకుండా ఆసుపత్రికి వెళ్లి.. మమ్మల్ని రమ్మంటే ఎలా? డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా ఇలాగే ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్ టెస్టుకు రావాలి. వీరి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు’’ అని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ కేసు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల సవాల్ ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి ఆ పార్టీ ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లారు. అక్కడ రక్తనమూనాలు ఇచ్చారు. సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి రక్త నమూనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read Latet Telangana News And Telugu News