Share News

Justice Pinaki Chandra Ghosh: కాళేశ్వరంపై.. 18 నుంచి ఐఏఎ్‌సల విచారణ

ABN , Publish Date - Dec 15 , 2024 | 03:45 AM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకతలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ 18 నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ప్రక్రియను పునః ప్రారంభించనుంది.

Justice Pinaki Chandra Ghosh: కాళేశ్వరంపై.. 18 నుంచి ఐఏఎ్‌సల విచారణ

  • జాబితాలో స్మితాసబర్వాల్‌, రజత్‌కుమార్‌.. వికాస్‌రాజ్య, ఎస్‌కే జోషి, సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకతలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ 18 నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ప్రక్రియను పునః ప్రారంభించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఐఏఎస్‌, మాజీ ఐఏఎస్‌ అధికారులతోపాటు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఈ దఫా కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నించనుంది. ఇక ఈ నెల 17న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ హైదరాబాద్‌కు రానుండగా, మరుసటి రోజు(ఈనెల 18వ తేదీ) నుంచి విచారణ ప్రక్రియను ప్రారంభించనున్నారు.


ఈ దఫా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఎస్‌కే జోషీ, రజత్‌కుమార్‌, ఇన్‌చార్జి కార్యదర్శులుగా పనిచేసిన సోమేశ్‌కుమార్‌, వికా్‌సరాజ్‌, స్మితా సభర్వాల్‌ తదితరులను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను సైతం ఇదే దఫాలో ప్రశ్నించనుంది. కమిషన్‌ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో.. రెండునెలలు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - Dec 15 , 2024 | 03:45 AM