ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1.33 కేజీల బంగారం చోరీ

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:57 PM

పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 133 తులాల(1.33కేజీల) బంగారు ఆభరణాలు, 80తులాల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదు మాయమైంది.

దొంగతనం జరిగిన ఇంటి వద్ద వివరాలు సేకరిస్తున్న నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌

80తులాల వెండి, రూ.2.5 లక్షల నగదూ మాయం

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంట్లో భారీ దొంగతనం

శంకర్‌పల్లి, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 133 తులాల(1.33కేజీల) బంగారు ఆభరణాలు, 80తులాల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదు మాయమైంది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి శంకర్‌పల్లి పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్‌పల్లి బల్దియా కౌన్సిలర్‌ పార్శి రాధా, బాలక్రిష్ణ కూతురు పెళ్లి ఈనెల 20(బుధవారం) రోజున జరగాల్సి ఉంది. 17వ తేదీ ఆదివారం పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి వంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాను తెరిచారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా లబోదిబోమన్నారు. అర్ధరాత్రి 12:30లకు శంకర్‌పల్లి పోలీసులకు పెళ్లి కూతురు తండ్రి పార్శి బాలక్రిష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌, శంకర్‌పల్లి సీఐ శ్రీనివా్‌సగౌడ్‌, నార్సిగి సీఐ హరిప్రసాద్‌ రెడ్డి, శంకర్‌పల్లి ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలపై ఆరాతీశారు. క్లూస్‌ టీంతో పాటుగా ఫింగర్‌ప్రింట్‌ వారిని రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 18 , 2024 | 11:57 PM