ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరుగో పరుగు

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:13 PM

నందిగామ మండలపరిధిలోని కన్హాశాంతివనంలో మినిస్ర్టీ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌ ఇండియా సహకారంతో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ గ్రాన్యూల్స్‌ ఇండియా ఆధ్వర్యంలో గ్రీన్‌ కన్హాలో భాగంగా 2కే, 5కే, 10కే, 21కే రన్‌ పోటీలను ఆదివారం నిర్వహించారు.

రన్‌ను ప్రారంభిస్తున్న సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి

కన్హా శాంతివనంలో అట్టహాసంగా గ్రాన్యూల్స్‌ గ్రీన్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ రన్‌

2కే, 5కే, 10కే, 21కే రన్‌ పోటీలు

హాజరైన సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, క్రీడాకారులు

నందిగామ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నందిగామ మండలపరిధిలోని కన్హాశాంతివనంలో మినిస్ర్టీ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌ ఇండియా సహకారంతో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ గ్రాన్యూల్స్‌ ఇండియా ఆధ్వర్యంలో గ్రీన్‌ కన్హాలో భాగంగా 2కే, 5కే, 10కే, 21కే రన్‌ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని సుమారు 60 నగరాల నుంచి 4200 మంది పాల్గొన్నారు. పోటీలను సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, రామచంద్రమిషన్‌ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. గ్రాన్యూల్స్‌ గ్రీన్‌ హార్ట్‌ఫుల్‌ నెస్‌ రన్‌ ద్వారా వచ్చే డబ్బును చెట్ల పెంపకానికి ఉపయోగించడం అభినందనీయమని సీపీ అన్నారు. యువకుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పరుగు పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పారిస్‌ పారా ఒలింపిక్స్‌ కాంస్య విజేత దీప్తి జీవన్‌జీ అన్నారు. గ్రాన్యూల్స్‌ గ్రీన్‌ హార్ట్‌ఫుల్‌ నెస్‌ రన్‌ ద్వారా వచ్చే ఆదాయంతో అడవుల్లో 10 వేల చెట్లను పెంచడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్లు రవిశాస్ర్తి, ఆర్‌.శ్రీధర్‌ మద్దతు తెలిపారు. గెలుపొందిన వారికి పద్మభూషణ్‌ గ్రహీత కమలే్‌షపటేల్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రాన్యూల్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఉమా చిగురుపాటి, ఇండియన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌ నాగపురి రమేష్‌, ఐపీఎస్‌ అధికారి బలరాం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:13 PM