మద్యం మత్తులో చెరువులో పడి వ్యక్తి మృతి
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:48 PM
మద్యం మత్తులో చెరువులో పడి ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొంరా్‌సపేట్ మండలంలో జరిగింది.
బొంరా్‌సపేట్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో చెరువులో పడి ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొంరా్‌సపేట్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తూర్ గ్రామానికి చెందిన మంగలి నర్సింహులు(35) కొంత కాలంగా తన భార్యా పిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అద్దెకు ఇంటిని తీసుకొని సెలూన్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన నర్సింహులు ఇటీవల హైదరాబాద్‌లో పనిచేయకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి 15 రోజుల క్రితం వచ్చాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసై శనివారం సాయంత్రం కొత్తూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు దగ్గరికి వెళ్లి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో నర్సింహులు చెరువులో మునిగి మృతిచెందాడు. నర్సింహులు కుటుంబీకులు భార్య రజితకు సమాచారం అందించడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు.
గుర్తుతెలియని యాచకుడు..
వికారాబాద్: ఆకలికి తాళలేక ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భీమ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుర్గా భవానీ హోటల్ ఎదుట ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండడంతో హోటల్ యాజమాని హోటల్ తెరిచేందుకు వెళ్లి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూడగా మృతుడు రైల్వేస్టేషన్ ఆవరణలో బిక్షాటన చేస్తూ అక్కడే పండుకునే వాడిగా గుర్తించారు. అతడికి ఆహారం సరిగ్గా లేక ఆకలితో మృతిచెంది ఉంటాడని, ఇతడి ఒంటిపై గ్రీన్ కలర్ షర్ట్, దానిపై చలికోటు, దానిపై రెడ్ చలి కోటు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 8712670030 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
Updated Date - Nov 17 , 2024 | 11:48 PM