సమగ్ర సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:01 AM
సమగ్ర ఇంటింటి సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు ఇంటి యజమానులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డుల నెంబర్లు సరిగ్గా నమోదు చేయాలని, పత్రాలపై తప్పులు లేకుండా జాగ్రత్త పడాలని యాచారం ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తెలిపారు.
యాచారం/ఆమనగల్లు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సమగ్ర ఇంటింటి సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు ఇంటి యజమానులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డుల నెంబర్లు సరిగ్గా నమోదు చేయాలని, పత్రాలపై తప్పులు లేకుండా జాగ్రత్త పడాలని యాచారం ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో ఆయన సర్వేను పరిశీలించారు. సర్వే పత్రాలు లేకపోతే తక్షణమే తనకు లేదా ఎంపీవోలకు సమాచారమందించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో 4వేల పత్రాలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలు కూడా ఎన్యుమరేటర్లకు సహకరించి సరైన సమాచారమందించాలని కోరారు. ఆయన వెంట మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షణాధికారి శైలజ, పంచాయతీ కార్యదర్శి తిరుపతి తదితరులున్నారు. అలాగే ఆమనగల్లు మున్సిపాలిటీలో కులగణన సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన నివాసాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. సర్వే తీరును మున్సిపల్ కమిషనర్ వసంత పరిశీలించి పలు సూచనలు చేశారు. సర్వే సమగ్రంగా పక్కాగా చేపట్టాలని సూచించారు. ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాలలో ఎంపీడీవో మాధురి సర్వేను పరిశీలించారు.
Updated Date - Nov 16 , 2024 | 12:01 AM