గౌడ కులస్థులందరూ ఐక్యంగా ఉండాలి
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:34 PM
గౌడ కులస్థుందరూ ఐక్యంగా ఉండి పనిచేస్తే ఏ పార్టీలో ఉన్నా పదవులు వరిస్తాయని నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు.
మొయినాబాద్ రూరల్/ఆమనగల్లు/శంషాబాద్, సెప్టెంబరు 10: గౌడ కులస్థుందరూ ఐక్యంగా ఉండి పనిచేస్తే ఏ పార్టీలో ఉన్నా పదవులు వరిస్తాయని నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహే్‌షకుమార్ గౌడ్‌ను నియమించిన సందర్భంగా మొయినాబాద్ గౌడ సంఘం నాయకులు మంగళవారం నగరంలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్, మండలాధ్యక్షుడు అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి ఎల్గని నవీన్‌కుమార్‌గౌడ్, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు. అదేవిధంగా మహేశ్ కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ జిల్లా నాయకుడు జెల్ల రమేశ్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాల, శాలువాలతో సత్కరించి అభినందించారు. అలాగే మహే్‌షకుమార్ గౌడ్‌ను శంషాబాద్‌కు చెందిన పీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు జె.నరేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శంషాబాద్ మండలాధ్యక్షుడు శేఖర్‌యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, కార్యకర్తలు ఉన్నారు.