Share News

గ్రూప్‌-3 పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:22 PM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్‌-3 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

గ్రూప్‌-3 పరీక్షలకు సర్వం సిద్ధం
మొయినాబాద్‌లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నేటి నుంచి రెండు రోజుల పాటు ఎగ్జామ్స్‌

హాజరు కానున్న 56,394 మంది అభ్యర్థులు

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్‌-3 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు జిల్లాలో 56,394 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 17వ తేది (ఆదివారం) రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్‌ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష జరగనుంది. అలాగే ఈనెల 18వ తేది (సోమవారం) ఉదయం 3 పేపర్‌ ఉంటుంది. అభ్యర్థులను పరీక్షకు ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారు. 9.30 గంటల తర్వాత గేట్లు మూసి వేయనున్నారు. ఆలస్యంగా వస్తే అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:22 PM