‘డ్రంకెన్ డ్రైవ్’ను తప్పించుకోబోయి రాంగ్‌రూట్‌లో వెళ్లి..
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:08 PM
డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ను తప్పించుకోబోయిన కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లేందుకు యత్నించగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైకర్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బైక్‌ను ఢీకొన్న కారు.. బైకర్ అక్కడికక్కడే మృతి
శంషాబాద్ రూరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ను తప్పించుకోబోయిన కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లేందుకు యత్నించగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైకర్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్ కథనం మేరకు.. శంషాబాద్ మండల పరిధిలోని రషీద్‌గూడకు చెందిన కావలి దర్శన్(51) పని నిమిత్తం బైక్‌పై ఆరాంఘర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్యారడైజ్ హోటల్ వద్దకు చేరుకున్నాడు. ఈక్రమంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ను తప్పించుకోబోయిన కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లేందుకు యత్నించాడు. దాంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొంది. బైక్‌పై ఉన్న దర్శన్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Nov 16 , 2024 | 11:08 PM