ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బావ, మరిది ఘర్షణ.. ఇద్దరూ మృతి

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:23 AM

పాత కక్షలతో బావ, మరిది ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడటంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిళ్లకు చెందిన బర్కని యాదయ్యకు మేడిపల్లికి చెందిన మక్కపల్లి శ్రీను సోదరిని ఇచ్చి వివాహం చేశారు. పదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో యాదయ్య భార్యను చంపేశాడు.

మాడ్గుల, నవంబరు 17(ఆంద్రజ్యోతి): పాత కక్షలతో బావ, మరిది ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడటంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిళ్లకు చెందిన బర్కని యాదయ్యకు మేడిపల్లికి చెందిన మక్కపల్లి శ్రీను సోదరిని ఇచ్చి వివాహం చేశారు. పదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో యాదయ్య భార్యను చంపేశాడు. దాంతో అతడు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. ఈక్రమంలో శ్రీను ఆదివారం అతడి భార్య ఊరుకూడా నాగిళ్ల కావడంతో అక్కడికి వెళ్లాడు. అయితే, తన అక్క మరణానికి కారణమైన బావపై కోపం పెంచుకొన్న అతడు.. ఆదివారం రాత్రి నాగిళ్లలోని యాదయ్య ఇంటికి వెళ్లాడు. మా అక్కను చంపావంటూ బావ యాదయ్యపై చేయి చేసుకున్నాడు. దాంతో యాదయ్య ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొచ్చి శ్రీనును నరికి చంపాడు. అయితే, అప్పటికే జైలు జీవితం గడిపిన యాదయ్య అనారోగ్యంతో ఉన్నాడని.. ఘర్షణలో అతడికి కూడా గాయాలు కావడంతో చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందడంతో విచారణ ప్రారంభించారు.

Updated Date - Nov 18 , 2024 | 12:23 AM