Share News

గో సంరక్షణను బాధ్యతగా భావించాలి

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:19 PM

గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ గ్రామపంచాయతీ మక్తా గ్రామంలో మార్వాడీ కమ్యూనిటీ హాల్‌లో సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హాయ్‌ మాతా మందిరం, గోశాల పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గో సంరక్షణను బాధ్యతగా భావించాలి
మాట్లాడుతున్న ఎంపీ ఈటల రాజేందర్‌

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌

ఘట్‌కేసర్‌, నవంబర్‌ 18(ఆంధ్రజ్యోతి): గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ గ్రామపంచాయతీ మక్తా గ్రామంలో మార్వాడీ కమ్యూనిటీ హాల్‌లో సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హాయ్‌ మాతా మందిరం, గోశాల పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గో సంరక్షణకు మార్వాడీ సేవా సమాజం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, శామిర్‌పేట మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, బీజేపీ నాయకులు సొల్లేటి కరుణాకర్‌, పోలగౌడ్‌ మహే్‌షగౌడ్‌, వికా్‌సగౌడ్‌, మార్వాడి సేవా సమాజం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:19 PM