ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లగచర్ల గిరిజనులపై కుట్రపూరిత కేసులు

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:13 PM

లగచర్ల గిరిజనులపై రేవంత్‌ సర్కార్‌ అక్రమంగా, కుట్రపూరితంగా పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. రిమాండ్‌కు తరలించిన గిరిజనులను వెంటనే విడుదల చేయకపోతే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది గిరిజనులతో కొడంగల్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న దశరథ్‌ నాయక్‌

కడ్తాల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): లగచర్ల గిరిజనులపై రేవంత్‌ సర్కార్‌ అక్రమంగా, కుట్రపూరితంగా పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. రిమాండ్‌కు తరలించిన గిరిజనులను వెంటనే విడుదల చేయకపోతే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది గిరిజనులతో కొడంగల్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. కడ్తాల మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ కక్ష, కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. లగచర్లలో ఫార్మాసిటీ పేరుతో భూములు లాక్కొని సీఎం అల్లుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. నమ్మి ఓట్లేసినందుకు జైలు పాలు చేస్తారా అని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు హరిచంద్‌నాయక్‌, లోకేశ్‌నాయక్‌, చత్రునాయక్‌, కస్ననాయక్‌, పాండు, రమణ, శ్రీను, సోమ్ల, బీమన్‌, అంజినాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

చలో లగచర్లను విజయవంతం చేయాలి

షాద్‌నగర్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) లగచర్ల గిరిజన రైతులను పరామార్శించడానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఈనెల 20న చలో లగచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్‌ మాట్లాడుతూ చలో లగచర్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూసేకరణ, పోలీసుల దాడుల్లో గాయపడ్డవారిని పరామర్శించేందుకే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండల పరిధిలోని రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, మైసమ్మగడ్డ తండా, గడ్డమీది తండా, ఈదులకుంట తండాలో తమ బృందం సభ్యులు పర్యటించి బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. లగచర్ల ఘటనపై బాధితులను పరామార్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ డీకే అరుణను అడ్డుకున్నా.. ఆ నేతలు స్పందించకపోవడం గమనార్హమన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పర్యటించేందుకు వెళ్లుతున్న ఒక ఎంపీని పోలీసులు అడ్డగించారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:13 PM