ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికల్లో లబ్ధికే బీఆర్‌ఎస్‌ విమర్శలు

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:54 PM

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సీనియర్‌ నేత రఘు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు

షాద్‌నగర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సీనియర్‌ నేత రఘు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కొందుర్గు మండలాభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తంగళ్లపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కొందుర్గు మండలానికి ఇంటెగ్రేటెడ్‌ స్కూల్‌, స్టేడియం నిర్మాణాలను నిధులు మంజూరు చేయించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Oct 20 , 2024 | 11:54 PM