Share News

గండిమైసమ్మకు దండిగా మొక్కులు

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:15 PM

మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. రంగురంగుల విద్యుత్‌ దీపాలు పచ్చటి తోరణాలు రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

గండిమైసమ్మకు దండిగా మొక్కులు
అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కడ్తాల్‌, నవంబరు 17(ఆంఽధ్రజ్యోతి) మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. రంగురంగుల విద్యుత్‌ దీపాలు పచ్చటి తోరణాలు రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన మైసమ్మ ఆలయానికి హిందువులతో పాటు ముస్లింలు కూడా హాజరవుతున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండ ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ శిరోలీ పంతు, ఈవో స్నేహలత ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పోట్టెత్తారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో ఆలంకరించి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు మైసమ్మ నామస్మరణతో మైసిగండి మారు మోగింది. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఉత్సవ నిర్వాహకుడు రమావత్‌ భాస్కర్‌, తహసీల్దారు ఆర్‌పీ జ్యోతి, మాజీ సర్పంచులు శేఖర్‌గౌడ్‌, తులసీరామ్‌నాయక్‌, అర్చకులు గ్రామ యువకులు తదితరులున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:15 PM