ఫోన్‌పే చేసినా డబ్బులు రాలే..
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:31 PM
ఫోన్‌పే యాప్ ద్వారా డబ్బులు చెల్లించి నమ్మించి వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసిన నలుగురు మైనర్లను ఎస్వోటీ గుర్తించి శనివారం కేసును చేవెళ్ల పోలీ్‌సలకు అప్పగించారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఉన్న దుర్గా వైన్ షాపులో రూ.65వేల మద్యం కొనుగోలు చేసిన మైనర్లు డబ్బు చెల్లించే క్రమంలో మోసగించారు.
కొన్ని రోజులుగా రూ.65 వేల మద్యం కొనుగోలు
డబ్బులు రాలేదని గమనించిన వైన్‌షాపు నిర్వాహకులు
పోలీస్‌లకు ఫిర్యాదు.. అదుపులో నలుగురు మైనర్లు
ఫేక్ ఫోన్‌పే యాప్ వాడినట్లు గుర్తింపు
చేవెళ్ల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : ఫోన్‌పే యాప్ ద్వారా డబ్బులు చెల్లించి నమ్మించి వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసిన నలుగురు మైనర్లను ఎస్వోటీ గుర్తించి శనివారం కేసును చేవెళ్ల పోలీ్‌సలకు అప్పగించారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఉన్న దుర్గా వైన్ షాపులో రూ.65వేల మద్యం కొనుగోలు చేసిన మైనర్లు డబ్బు చెల్లించే క్రమంలో మోసగించారు. షాపు యజమాని కౌంటర్‌లో డబ్బు తక్కువగా వస్తుందని గుర్తించి సీపీ టీవీ ఫుటేజీని చెక్ చేయగా.. కొందరు తరచూ కౌంటర్ బిజీగా ఉండే సమయంలో వచ్చి మద్యం కొనుగోలు చేసినట్లుగా గుర్తించి ఎస్వోటీకి సమాచారం అందించాడు. దాంతో ఆ బృందం రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజీని క్షుణంగా పరిశీలించి నలుగురు మైనర్లను గుర్తించి పట్టుకున్నారు. అయితే, వారు కొన్ని రోజులుగా అదే వైన్‌షాపులో మొత్తం 65 వేల మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. ఫేక్ ఫోన్‌పే ద్వారా డబ్బులు వేసినట్లు చూపించి.. మద్యం తీసుకెళుతున్నట్లు గుర్తించారు. యాజమానికి మాత్రం ఫోన్ పే ద్వారా డబ్బులు రావడం లేదు. పట్టుబడిన వారిని చేవెళ్ల పోలీ్‌సలకు అప్పగించటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫేక్ ఫోన్‌పే యాప్ ఎలా వచ్చింది? ఎవరి ద్వారా దీనిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నారు? ఇంకా ఈ తతంగంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీ్‌సలు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ యాప్ ద్వారా పట్టుబడిన నలుగురూ మైనర్లేనని పోలీ్‌సలు చెప్పారు. వైన్‌షాపులో పనిచేస్తున్న వారి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. కాగా, ఇలాంటి సైబర్ క్రైమ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీ్‌సలు సూచించారు.