మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి
ABN , Publish Date - Nov 15 , 2024 | 11:56 PM
బీజేపీ సభ్యత్వాలను పూర్తి చేసి, మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్యలు పిలుపునిచ్చారు.
షాద్‌నగర్ అర్బన్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బీజేపీ సభ్యత్వాలను పూర్తి చేసి, మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్యలు పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాష్ట్రంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, దానికి సాక్ష్యం లోక్‌సభ ఎన్నికల ఫలితాలేనని వివరించారు. బీజేపీ సభ్యత్వాలను తీసుకోవడానికి ప్రతీఒక్కరు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ఈనెలాఖరులోపు సభ్యత్వాలను పూర్తిచేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. షాద్‌నగర్ పట్టణంలో సైతం మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలువడానికి మంచి అవకాశం ఉందని, అన్ని వార్డుల్లో పోటీ చేసి, విజయం సాధించడానికి సన్నద్ధమై సానుకూల వాతావరణాన్ని కల్పించుకోవాలని కోరారు. పట్టణ శాఖ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు చెంది మహేందర్‌రెడ్డి, అండాపురం నర్సింహగౌడ్, ప్యాట అశోక్, ఇస్నాతి శ్రీనివాస్, చెట్ల వెంకటేష్, మోహన్‌సింగ్, బాల్‌రెడ్డి, నర్సింహ, శివశంకర్, ప్రవీణ్, బాల్‌రాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.