ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఆర్‌ఎస్‌ కుట్రలో భాగమే లగచర్ల ఘటన

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:13 PM

లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ కుట్రలో భాగమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్‌ బిక్యానాయక్‌, రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు హన్మానాయక్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరచి రాజకీయంగా లబ్ధిపొందేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే అధికారులపై దాడులు జరిగాయని ఆరోపించారు.

విలేకరులతో మాట్లాడుతున్న హన్మానాయక్‌, బిక్యానాయక్‌

-కేటీఆర్‌ వెంటనే అరెస్టు చేయాలి

-డీసీసీ ప్రధాన కార్యదర్శి బిక్యానాయక్‌

కడ్తాల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ కుట్రలో భాగమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్‌ బిక్యానాయక్‌, రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు హన్మానాయక్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరచి రాజకీయంగా లబ్ధిపొందేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే అధికారులపై దాడులు జరిగాయని ఆరోపించారు. కడ్తాల మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించిన కేటీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొడంగల్‌ అభివృద్ధి జరుగుతుంటే జీర్ణించుకోలేని కేటీఆర్‌ విషం కక్కుతున్నారని వారు మండిపడ్డారు. కొడంగల్‌ను 2018లో కేటీఆర్‌ దత్తత తీసుకొని కృష్ణాజలాలతో కాళ్లు కడుగుతా అని జనాన్ని సమ్మించి అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా మోసం చేశారని మండిపడ్డారు. లగచర్ల గిరిజన రైతులందరూ ఆమాయకులని వాళ్లను రెచ్చగొట్టి అధికారులపై దాడులకు పాల్పడేలా చేసిన కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరారు. సమస్యలపై ప్రజల తరపున పోరాడాల్సిన ప్రతిపక్షం అమాయక ప్రజలను అడ్డుపెట్టుకొని అలజడులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి చర్యలను ఆపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సేవాదల్‌ మండల అధ్యక్షులు లక్ష్మయ్య, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రామకృష్ణ, నరేందర్‌, రమేశ్‌ నాయక్‌, నరేశ్‌ నాయక్‌, దేవ్లా, సేవ్యానాయక్‌, బలరాం, లక్పతినాయక్‌ తదితరులున్నారు.

బీఆర్‌ఎస్‌ నేతల ద్వంద్వ నీతి సరికాదు

యాచారం: లగచర్ల ఘటనను బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయం చేయడం దారుణమని యాచారం మండల కాంగ్రెస్‌ నాయకులు దెంది రాంరెడ్డి, మస్కు నర్సింహులు మండిపడ్డారు. వారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఎందుకు పేదల భూములు తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ భూములు తీసుకోవడంతో అనేక మంది పేదలు నేడు ఉపాధి లేక అల్లాడుతున్నారని వారు ఆందోళన చెందారు.

Updated Date - Nov 17 , 2024 | 11:13 PM