స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా పనిచేయండి
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:11 PM
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఫరూఖ్‌నగర్ మండలశాఖ అధ్యక్షుడు వెంకటే్‌షయాదవ్ అధ్యక్షతన శనివారం స్థానిక ఏబీ కాంప్లెక్‌లో ఫరూఖ్‌నగర్ మండల సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం జరిగింది.
షాద్‌నగర్ అర్బన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఫరూఖ్‌నగర్ మండలశాఖ అధ్యక్షుడు వెంకటే్‌షయాదవ్ అధ్యక్షతన శనివారం స్థానిక ఏబీ కాంప్లెక్‌లో ఫరూఖ్‌నగర్ మండల సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డిలు హాజరై మాట్లాడారు. పల్లె ప్రాంతాల్లో సైతం పార్టీ సభ్యత్వం సానుకూలంగా సాగిందని, కేంద్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చర్చిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరణంలో స్థానిక సంస్థల్లో సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీచేసి గెలవడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. వంశీకృష్ణ, వెంకనోళ్ళ వెంకటేష్, లష్కర్‌నాయక్, వి.నర్సింహ, వినోద్‌నాయక్, పి.సురేష్, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 11:11 PM