Share News

లగచర్లలో పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:37 PM

లగచర్లలో పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, బుస్స చంద్రయ్య అంబేడ్కర్‌ సంఘం తాలూకా అధ్యక్షుడు రమేశ్‌బాబు అన్నారు.

లగచర్లలో పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలి
విలేకరులతో మాట్లాడుతున్న ప్రజా సంఘాల నాయకులు

బొంరా్‌సపేట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, బుస్స చంద్రయ్య అంబేడ్కర్‌ సంఘం తాలూకా అధ్యక్షుడు రమేశ్‌బాబు అన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. దుద్యాల మండలం లగచర్ల ఘటనపై సీపీఎం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే లగచర్ల ఘటన జరిగిందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పేద రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవడం సరైంది కాదన్నారు. కొడంగల్‌ ప్రాంతంలో ఉన్న 1154 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అనంతయ్య, కిష్టప్ప పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:38 PM