ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా పోరాటాలకు సిద్ధం

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:44 PM

రానున్న మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలే ఎజెండగా ప్రజల మధ్యలో ఉంటూ సీపీఎం పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ నూతన జిల్లా కార్యదర్శి ఆర్‌ .మహిపాల్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కార్మికులు, కర్షకులు, పేదల సమస్యలే ఎజెండాగా ముందుకు సీపీఎం జిల్లా మూడో మహాసభలు ఆదివారం ముగిశాయి.

-18 అంశాలపై తీర్మానాలు

-జిల్లా కార్యదర్శి మహిపాల్‌

-ముగిసిన సీపీఎం జిల్లా మహాసభలు

తాండూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రానున్న మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలే ఎజెండగా ప్రజల మధ్యలో ఉంటూ సీపీఎం పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ నూతన జిల్లా కార్యదర్శి ఆర్‌ .మహిపాల్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కార్మికులు, కర్షకులు, పేదల సమస్యలే ఎజెండాగా ముందుకు సీపీఎం జిల్లా మూడో మహాసభలు ఆదివారం ముగిశాయి. కామ్రేడ్‌ సీతారం ఏచూరి నగర్‌గా నామకరణం చేసిన ఈ సభలు తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ సభలో 18 అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టి తీర్మానించారు. విద్యార్థులకు పెండింగ్‌ ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్స్‌ విడుదల, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం, పాలమూరు - రంగారెడ్డి, కొడంగల్‌ - నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం, తాండూరులో కంది బోర్డు ఏర్పాటు, పోడు భూముల్లో సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతలకు హక్కు పత్రాలు, దళిత, గిరిజనులపై కుల వివక్ష దాడులు ఆరికట్టాలి. ధరణి పోర్టల్‌ను సవరించి జిల్లాలో భూ సమస్యల పరిష్కారం, మూసీ ప్రక్షాళన పేదలకు ప్రత్నామ్యయం, అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, దివ్యాంగులు, వృత్తిదారుల, కార్మికుల, ఉపాధ్యాయుల, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కారం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్‌ రుణాల మంజూరు, జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపడా మందుల సరఫరా తదితర అంశాలపై తీర్మానం చేపట్టారు. కాగా, మహాసభలు విజయానికి సహకారం అందించిన వారికి కమిటీ సభ్యులు కె. శ్రీనివాస్‌ ధన్యవాదలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులుగా ఎం. వె ంకటయ్య, పి. రామకృష్ణ, శ్రీనివాస్‌, బుగ్గప్ప, చంద్రయ్య, సుదర్శన్‌, సత్యనారాయణ, మంగమ్మ, నర్సమ్మ, నవీన్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:44 PM