ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలి

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:15 PM

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేసేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. యూసుఫ్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న యూసుఫ్‌

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌

శంషాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేసేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. యూసుఫ్‌ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లోని ఎలైట్‌ హోటల్‌లో ఆదివారం రెండో ఏఎన్‌ఎంల రాష్ట్ర ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో రెండో ఏఎన్‌ఎంల సంఖ్య దాదాపు 7000 ఉంటుందని, వారు 18 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయకపోవడం దారుణమన్నారు. వీరి శ్రమ కారణంగానే ప్రభుత్వానికి అనేక అవార్డులు వస్తున్నాయన్నారు. కానీ రెండో ఏఎన్‌ఎంలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఏఐటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చేస్తుందన్నారు. మహిళలు అని కూడా చూడకుండా ఏఎన్‌ఎంలపై మొండివైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. వీరిని పర్మినెంట్‌ చేయాలని, అలా కుదరకపోతే 5వేల పోస్టులను మంజూరు చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మ, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సోమిరెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు సక్రూ, రాష్ట్ర నాయకురాలు రమావత్‌రాణి, ఏఎన్‌ఎంల సంఘం రాష్ట్ర నాయకులు శ్యామల, జయ, పద్మ, సువర్ణ, అరుణ, జయమమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:15 PM