ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిలావస్థలో షాదీఖానా!

ABN, Publish Date - Nov 15 , 2024 | 11:58 PM

ఇబ్రహీంపట్నం చెరువు కట్ట కింద ముస్లిం మైనారిటీ షాదీఖానా నిర్వహణలేక శిథిలావస్థకు చేరుకుంది. కాంపౌండ్‌లో ఏపుగా చెట్లు పెరిగి చెత్తా చెదారంతో కనీసం కాలు పెట్టలేకుండా ఉంది.

చెరువుకట్ట కింద నిరుపయోగంగా ఉన్న ముస్లిం మైనారిటీ షాదీఖానా

రూ.50లక్షలతో భవన నిర్మాణం

ఒకప్పుడు జోరుగా ఫంక్షన్లు.. ఇతర కార్యక్రమాలు

నేడు పిచ్చిమొక్కలు పెరిగి అధ్వాన స్థితికి..

ఇబ్రహీంపట్నం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం చెరువు కట్ట కింద ముస్లిం మైనారిటీ షాదీఖానా నిర్వహణలేక శిథిలావస్థకు చేరుకుంది. కాంపౌండ్‌లో ఏపుగా చెట్లు పెరిగి చెత్తా చెదారంతో కనీసం కాలు పెట్టలేకుండా ఉంది. 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సుమారు రూ.50 లక్షలు వెచ్చించి నిర్మాణం చేశారు. మొదట్లో షాదీఖానాలో పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, చిన్న చిన్న దావత్‌లు బాగా జరిగేవి. ముస్లింలే గాకుండా ఇతర వర్గాలు కూడా నిర్వహణకోసం చిన్న మొత్తంలో చెల్లించి ఇందులో ఫంక్షన్లు చేసుకునేవారు. అయితే, రాను రాను దీని నిర్వహణను పూర్తిగా మరిచిపోయారు. అటువైపు కనీసం కన్నెత్తి చూడలేకపోతున్నారు. దాంతో పరిసరాల్లో చెట్లు ఏపుగా పెరిగి భవనం పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయింది. అధికార యంత్రాంగం కూడా దీన్ని మరిచిపోయినట్లుంది. ఈ షాదీఖానాకు పైనే ఇబ్రహీంపట్నం పాషా దర్గా ఉంది. అందరికీ అందుబాటులో మంచి వాతావరణంలో ఉన్న భవనానిన మున్సిపాలిటీ నిర్వహణలోకి తెస్తే పేద, మధ్య తరగతి వర్గాలు తిరిగి వివిధ రకాల ఫంక్షన్లు జరుపుకునే అవకాశం ఉంటుంది.

భవనాన్ని నిర్వహణలోకి తేవాలి

లక్షలు వెచ్చించి అప్పట్లోనే షాదీఖానాను చక్కగా నిర్మించారు. పేద, మధ్య తరగతి వాళ్లు పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుపుకోవడానికి అనుకూలంగా ఉండేది. భవనాన్ని తిరిగి నిర్వహణలోకి తెస్తే బయట ఫంక్షన్‌ హాళ్లకు పెద్ద మొత్తంలో చెల్లించుకోలేని వారికి ప్రయోజనంగా ఉంటుంది.

- ఎండీ గౌస్‌, ఇబ్రహీంపట్నం

Updated Date - Nov 15 , 2024 | 11:58 PM