రోకలితో మోది తల్లిని హతమార్చిన కొడుకు
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:13 AM
రోకలిబండతో మోది కొడుకు తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం జరిగింది.
యాలాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రోకలిబండతో మోది కొడుకు తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం జరిగింది. రూరల్ సీఐ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జక్కేపల్లికి చెందిన బొల్లె చంద్రమ్మ(80) కొడుకు బల్లె వెంకటయ్య జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస య్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తరచూ తల్లిని వేధించేవాడు. గురువారం రాత్రి పింఛన్ డబ్బులు ఇవ్వాలని, లేదంటే బంగారం ఇవ్వాలని తల్లితో గొడవపడ్డాడు. చంద్రమ్మ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వెంకటయ్య ఇంట్లో నుంచి రోకలి బండను తెచ్చి తల్లి ఛాతి, కాళ్లపై గట్టిగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐ గ్రామానికి వెళ్లి విచారించారు. మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.