ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడా ప్రాంగణాలు వేస్ట్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:27 PM

లక్షలు ఖర్చుపెట్టి జిల్లాలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు వృథాగా మారాయని దిశ కమిటీ చైర్మన్‌, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించండి

పది శీతల గిడ్డంగులకు ప్రతిపాదనలు పంపండి

విశ్వకర్మ పథకం అమలు తీరు బాగాలేదు

ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

హరితహారం బోగస్‌.. రికార్డులకే పరిమితం

దిశ కమిటీ చైర్మన్‌, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సమావేశానికి ఎమ్మెల్యే వీర్లపల్లి ఒక్కరే హాజరు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : లక్షలు ఖర్చుపెట్టి జిల్లాలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు వృథాగా మారాయని దిశ కమిటీ చైర్మన్‌, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. కేంద్రం నిధులతో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంగణాలను రద్దు చేయడమా.. లేదా అందుబాటులోకి తీసుకురావడమా.. ఏదో ఒకటి చేద్దామన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆరోపించారు. హరితహారం ద్వారా వందశాతం మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పడంతో.. దిశ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది 90 శాతం బోగస్‌ అని, హరితహారం రికార్డులకే పరిమితమని విమర్శించారు. హరితహారం మొక్కలను పరిశీలించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే కూరగాయ పంటలను ఉపాధిహామీ పథకానికి అనుసంధానించాలని ఉద్యానశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. పంటల సాగుపై, భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారిని ఎంపీ ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి సూచించారు. పంటలను నిలువ చేసేందుకు జిల్లాలో 10 శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. పుట్టగొడుగుల పెంపకాన్ని, పాడి రైతులను ప్రోత్సహించాలని జిల్లా పశువైద్యాధికారికి సూచించారు. పశువులకు సరైన వైద్యం అందటం లేదని, ఆసుపత్రిలో కనీసం అటెండర్‌ కూడ ఉండటం లేదని ఆరోపించారు. గోపాల మిత్ర పశువులకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు రూ.250 తీసుకుంటున్నారని సభ్యులు దిశ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లాలో రోగులకు మెరుగైన వైద్యం అందటం లేదని, బస్తీ దవఖానాలో మెడిసిన్‌ లేదన్నాన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఎక్కడా అమలుకావడం లేదని ఆరోపించారు. జిల్లాలో డయాలసిస్‌ రోగుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరం ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ నిరుపయోగంగా ఉందని సభ్యులు తెలిపారు. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేసుకుంటున్న వారి జాబితా తనకు అందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివ్వాలని, రక్తహీనతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. జాబ్‌మేళాను నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉపాధి కల్పన అధికారిని ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సదరన్‌ క్యాంపు ప్రతినెలా నిర్వహించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి కోరారు. కేంద్రం అందిస్తున్న పథకాలు చాలామందికి తెలియడం లేదని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీ ఆదేశించారు. విశ్వకర్మ పథకం ప్రచారం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ.. అమలు తీరు మాత్రం బాగాలేదన్నారు. పది శాతం కూడ లక్ష్యం చేరుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. సీతారాంపూర్‌లో పరిశ్రమలకు గుడి భూములు ఎలా ఇస్తారని ఎంపీ ప్రశ్నించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌, హెచ్‌ఎండబ్ల్యుడీసీ ఈడీ వయంక, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

జిల్లా టార్గెట్‌ 50 వేల కోట్లా?

జిల్లా సమీక్షలో భాగంగా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని రూ.50వేల కోట్లుగా చెప్పడంతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వామ్మో ఇంత పెద్దమొత్తంలో టార్గెట్టా అని విస్మయం వ్యక్తం చేశారు. ఇచ్చిన లక్ష్యంలో 50 శాతం అమలైనా.. జిల్లాలో పేదోళ్లు అనేవారు ఉండరన్నారు.

ఎమ్మెల్యేలు డుమ్మా..!

దిశ సమావేశానికి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా డుమ్మా కొట్టారు. చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, మహేశ్వరం, కల్వకుర్తి ఎమ్మెల్యేలు దిశ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలకు ఒకరిద్దరు మినహా ఎవరూ హాజరు కావడం లేదు.

Updated Date - Nov 16 , 2024 | 11:27 PM