Share News

తెగిపడిన విద్యుత్‌ లైన్‌.. గృహోపకరణాలు ధ్వంసం

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:27 AM

ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్‌లైన్‌ తెగిపడడంతో రెండిళ్లలో గృహోపకరణాలు ధ్వంసమైనాయి.

తెగిపడిన విద్యుత్‌ లైన్‌.. గృహోపకరణాలు ధ్వంసం

ఆమనగల్లు, ఆగస్టు 1 : ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్‌లైన్‌ తెగిపడడంతో రెండిళ్లలో గృహోపకరణాలు ధ్వంసమైనాయి. ఈ ప్రమాదంలో వైర్‌ తెగిపడిన చోట మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిన వైనం గురువారం జరిగింది. ఆమనగల్లులోని 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి సూర్యలక్ష్మి కాటన్‌మిల్లుకు విద్యుత్‌ సరఫరా కోసం 33 కేవీ లైన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో కావటి కొండాల్‌ ఇంటి ముందు 33 కేవీ విద్యుత్‌ వైర్‌ తెగిపడింది. దాంతో కొండల్‌ ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్‌, స్విచ్‌బోర్డులు కాలిపోయాయి. రోడ్డు పక్కన ఉన్న భూషణ్‌ హోటల్‌ రిఫ్రిజిరేటర్‌తో పాటు స్విచ్‌బోర్డులు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రిఫ్రిజిరేటర్‌ తెరవకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని ఆ యన ఆందోళన చెందాడు. ఏఈ సీతారాములు పరిశీలించారు. తెగిపడిన వైర్‌ను అతికించి విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు.

Updated Date - Aug 02 , 2024 | 12:27 AM