గడువులోగా సర్వే పూర్తి చేయాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:55 PM
ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
మొయినాబాద్, నవంబర్ 15 ( ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. శుక్రవారం మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేటర్స్ అడిగే ప్రశ్నలకు ప్రజల నుంచి వస్తున్న సమాధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, గ్రామ కార్యదర్శి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 11:55 PM