Share News

యువకుడు అదృశ్యం

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:30 PM

హెయిర్‌ కటింగ్‌ కోసం వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన మోకిల పోలీ్‌సస్టేషన్‌ పరిఽధిలో ఈనెల 27న చోటుచేసుకుంది. బిహార్‌ నుంచి బిందుకుమారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామ పరిధిలో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

యువకుడు అదృశ్యం

చేవెళ్ల/శంకర్‌పల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): హెయిర్‌ కటింగ్‌ కోసం వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన మోకిల పోలీ్‌సస్టేషన్‌ పరిఽధిలో ఈనెల 27న చోటుచేసుకుంది. బిహార్‌ నుంచి బిందుకుమారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామ పరిధిలో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 27న సాయంత్రం బిందుకుమారి సోదరుడు దీపక్‌ కుమార్‌ హెయిర్‌ కటింగ్‌ షాపుకు వెళ్తునట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. హెయిర్‌ కటింగ్‌ చేయించుకొన్న తర్వాత ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మోకిల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీ్‌సలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిస్తే 87126-63499 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - Dec 28 , 2024 | 11:30 PM