ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘట్‌కేసర్‌ బైపాస్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:51 PM

ఘట్‌కేసర్‌లోని బైపా్‌సరోడ్డులో ఆదివారం రాత్రి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వరంగల్‌ వైపునకు వెళ్తూ నిలిచిన వాహనాలు

ఘట్‌కేసర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఘట్‌కేసర్‌లోని బైపా్‌సరోడ్డులో ఆదివారం రాత్రి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరవాసులు యాదగిరిగుట్ల, స్వర్ణగిరితోపాటు వివిధ పనులపై వరంగల్‌ వైపునకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ఘట్‌కేసర్‌లోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దాదాపు మూడు గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వరంగల్‌ నుంచి నగరం వైపుకు వెళ్లాల్సిన వాహనాలు ఎన్‌ఎఫ్‌ సీనగర్‌ సమీపంలోని హెచ్‌పీసీఎల్‌ వరకు, నగరం నుంచి వరంగల్‌ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు అన్నోజిగూడ వరకు నిలిచిపోయాయి. ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపునకు వెళ్లాల్సిన వాహనదారులు నాలుగు వైపులా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రధానరోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సర్వీసు రోడ్లపై వచ్చిన వాహనదారులు చౌరస్తా వద్ద నిలిచిపోయారు.

Updated Date - Nov 17 , 2024 | 11:51 PM