ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపయోగంగా రైతు బజార్‌

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:53 PM

స్థానిక చిరు వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి మేడ్చల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ నిరుపయోగంగా మారింది.

మార్కెట్‌ యార్డులో ఖాళీగా ఉన్న షెడ్లు

  • కారు పార్కింగ్‌గా మారుతున్న షెడ్లు

  • ఫుట్‌పాత్‌లకే పరిమితమవుతున్న చిరువ్యాపారులు

  • వ్యాపారులను ఒకేచోటుకు చేర్చడంలో పాలకులు విఫలం

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక చిరు వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి మేడ్చల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ నిరుపయోగంగా మారింది. రైతు బజార్‌ ఏర్పాటుకు ముందు స్థానికంగా ఫుట్‌పాత్‌లపై, తోపుడు బండ్లపై పండ్లు, పూలు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు తమకు వ్యాపార సముదాయం ఏర్పాటుచేయాలని పాలకుల చుట్టూ తిరిగారు. అనేక తంటాలు పడి పాలకులు మార్కెట్‌ కమిటీ వారి ఆధ్వర్యంలో మేడ్చల్‌ పట్టణ నడి బొడ్డున రైతు బజార్‌ ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రైతుబజార్‌లో చిరు వ్యాపారులు మాత్రం తమ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మేడ్చల్‌ పట్టణం ప్రధాన మార్కెట్‌ సమీపంలో ఉన్న పశుసంవర్ధక శాఖకు చెందిన స్థలాన్ని మార్కెట్‌ కమిటీ వారు తమ ఆధీనంలో తీసుకున్నారు. స్థానికంగా రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై, తోపుడు వండ్లపై కూరగాయాలు, పండ్లు, పూలు విక్రయించే వ్యాపారస్తులకోసం రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 80దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా షెడ్లను ఏర్పాటు చేశారు. అయితే మటన్‌ విక్రయించే వ్యాపారులు కొన్ని షెడ్లలో తమ దుకాణాలు ప్రారంభించారు. మిగితా షెడ్లలో మాత్రం వినియోగించుకునేందుకు ఇతర వ్యాపారస్తులు ముందుకు రావడంలేదు. దీంతో షెడ్లు నిరుపయోగంగా మారాయి. వందల సంఖ్యలో చిరు వ్యాపారస్తులు పట్టణంలోని రోడ్ల ఫుట్‌పాత్‌లపై దుకాణాలు పెట్టుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసుకుంటున్నారు. అయినప్పటికీ మార్కెట్‌ కమిటీ వారు ఏర్పాటుచేసిన రైతుబజార్‌ షెడ్లను వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. చిరు వ్యాపారులందరినీ ఒక్క చోటుకు తీసుకురావడానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, స్థానిక మున్సిపల్‌ అధికారుల మద్య సమన్వయం లోపించటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

ఫుట్‌పాత్‌లు వీడని వ్యాపారస్తులు

మేడ్చల్‌ పట్టణంలోని వివేకానంద్‌ చౌరస్తా నుంచి మహవీర్‌ చౌరస్తా వరకు ఉన్న పాత జాతీయరహదారి ఇరువైపులా చిరువ్యాపారస్తులు వందల సంఖ్యలో దుకాణాలు పెట్టుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారస్తులను రైతుబజార్‌ షెడ్లకు తరలించడానికి స్థానిక మార్కెట్‌ కమిటీ, మున్సిపల్‌ అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వారు ఫుట్‌పాత్‌లు వదిలి రావడానికి సిద్ధంగా లేరని అధికారులు అంటున్నారు. రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులను రైతుబజార్‌కు తరలించాలని స్థానికకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండటంలేదు. ఫలితంగా ప్రధాన మార్కెట్‌లో నిత్యం ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసే వారితో ద్విచక్ర వాహనాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కార్‌ పార్కింగ్‌గా మారిన రైతు బజార్‌ షెడ్లు

రైతుబజార్‌లో ఖాళీగా ఉన్నషెడ్లను స్థానికులు కొందరు కార్‌పార్కింగ్‌ షెడ్లుగా మార్చేశారు. కాలనీలో పార్కింగ్‌కు సరైన స్థలం లేక ఇక్కడ పార్కింగ్‌ చేస్తున్నామని వారంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ వారు పట్టించుకోక పోవటం గమనార్హం. దీంతో రోజురోజుకు కార్లు పార్కింగ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు రైతుబజార్‌ గురించి పట్టించుకునే వారు లేక ఇక్కడ రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:53 PM