Share News

పన్నులు పెంచకుండానే ప్రగతికి బాటలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:22 PM

రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నా.. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌ వీర్లపల్లి శంకర్‌ పేర్కొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో ఆదివారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం జరిగింది.

పన్నులు పెంచకుండానే ప్రగతికి బాటలు
ప్రజాపాలన విజయాలపై ప్రదర్శన ఇస్తున్న కళాకారులు

ప్రజాపాలన విజయోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

ఆకట్టుకున్న ఆరు గ్యారెంటీలపై కళాప్రదర్శనలు

షాద్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నా.. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌ వీర్లపల్లి శంకర్‌ పేర్కొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో ఆదివారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత-నాటక ప్రదర్శన రాష్ట్ర చైర్‌పర్సన్‌ అలేఖ్య పులిజాల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలపై కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై కళాకారులు నృత్య ప్రదర్శనలు చేస్తూ, ఒక్కొక్కటిగా ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ గత పాలకులు పదేళ్లలో అందినకాడికి దండుకుని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీటి సౌకర్యంతో పాటు రైల్వే లైను, పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి చేస్తున్న కృషిని కేటీఆర్‌ లాంటి బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్రలు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తారన్నారు. అలేఖ్య పులిజాల మాట్లాడుతూ షాద్‌నగర్‌లో ప్రారంభమైన కాంగ్రెస్‌ ప్రజాపాలన విజయోత్సవ సంస్కృత కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఆర్డీవో సరిత, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:22 PM