ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలందిస్తాం

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:10 PM

రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్పష్టం చేశారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌

సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే శంకర్‌

షాద్‌నగర్‌, నవంబరు16 (ఆంధ్రజ్యోతి) రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సూచించిన వారికే సంక్షేమ పథదకాలు అందజేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ టౌన్‌, చౌదరిగూడ, కేశంపేట, కొందుర్గు, ఫరూఖ్‌నగర్‌ మండలాలకు చెందిన 117మందికి రూ.35.38లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద 26మందికి రూ.26,3116లక్షల చెక్కులను అందజేశారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

పేదలకు నాణ్యమైన విద్యనందిద్దాం

షాద్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ, వారు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ఆలోచనతో నిర్మిస్తున్న స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి దాతలు సహకారం అందిస్తుండడం అభినందనీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. షాద్‌నగర్‌లో దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం కోసం నందిగామ మండలం చేగూరుకు చెందిన మాజీ ఎంపీపీ మంచనపల్లి ప్రియాంక శివశంకర్‌గౌడ్‌లు రూ.5లక్షల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు. శివశంకర్‌గౌడ్‌ దంపతులను ఎమ్మెల్యే శంకర్‌ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జంగ నర్సింహయాదవ్‌, కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, జమృద్‌ఖాన్‌, ముబారక్‌, కుమార్‌గౌడ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:10 PM