ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు భరోసా వెంటనే విడుదల చేయాల

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:40 AM

రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత డిమాండ్‌ చేశారు.

జగిత్యాలలో ఆందోళన నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత

జగిత్యాల క్రైం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) :రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత డిమాండ్‌ చేశారు. వర్షాకా లం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తహసీల్‌ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్‌ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ వసంత మాట్లాడుతూ అధికారం కోసమే ఆరు గ్యారంటీ ప థకాలను తీసుకవచ్చారే తప్ప అమలు చేయడం లేదన్నారు. సన్న రకం ధాన్యంతో పాటు అన్ని రకాల ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇవ్వాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌ రావు, నాయకులు శీలం ప్రియాంక ప్రవీణ్‌, తుమ్మ గంగాధర్‌, లక్ష్మణ్‌ రావు, ఆనంద రావు, వొళ్లెం మల్లేశం ఉన్నారు.

ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని కమలాపూర్‌ చౌరస్తా వద్ద ఆదివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా ని ర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి జరిపి ప్రభు త్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రహదారి ఇరువైపుల వాహ నాలు నిలిచి పోయాయి. విషయం తెలసుకున్న ఎస్‌ఐ గం గుల మహేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరు కుని కార్యకర్తలతో ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, వైస్‌ చైర్మన్‌ ఇందా రపు రామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆకుల రాజేష్‌, మాజీ వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.

ఫరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రైతులతో పా టు అన్ని వర్డాలను నయవంచనకు గురి చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. ధర్మపురి పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ ఒక్క వాగ్దాదాన్ని అ మలు చేయకుండా మాటల గారడీతో గత ప్రభుత్వాన్ని, కేసీ ఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:40 AM