ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్ మొరాయింపు
ABN , Publish Date - May 09 , 2024 | 05:08 AM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్ కుదుపునకు గురైంది. బుధవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై... మొరాయించింది. దాదాపు గంట పాటు
గంట తర్వాత పునరుద్ధరించిన అధికారులు
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్ కుదుపునకు గురైంది. బుధవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై... మొరాయించింది. దాదాపు గంట పాటు వెబ్‌సైట్ పనిచేయలేదు. దాంతో సాంకేతిక బృందాలు రంగంలోకి దిగి... వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాయి. వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైనట్లు, వినియోగదారుల డేటా చౌర్యం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని, విద్యుత్ వినియోగదారుల డేటా సురక్షితంగానే ఉందని అధికారులు ప్రకటించారు.