Share News

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

ABN , Publish Date - Nov 22 , 2024 | 09:36 AM

2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) తెలిపారు.

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్: 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) తెలిపారు. వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం, పశ్య పద్మ ఆధ్వర్యంలో 11 పార్టీల నాయకులు గురువారం దుద్యాల మండలం రోటిబండ తండా, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో పర్యటించి పలువురు రైతులతో మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విషాధం.. నవ్వుతూ చికిత్సకు వెళ్లిన మహిళ మృతి


city6.jpg

అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ తరహాలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నిరంకుశ పోకడలతో ప్రజాభీష్టం లేకుండా భూములు సేకరించడం సరైనది కాదని సూచించారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను పునరుద్ధరించడమే అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. గెలిచాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చాక ప్రగతిభవన్‌ గేట్లను తొలగించడం తప్ప ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ అప్రజాస్వామికమని ఎద్దేవా చేశారు. లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని సీపీఐ నాయకురాలు పశ్య పద్మ డిమాండ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య

ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భేటీ

ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2024 | 09:36 AM