Share News

Exams: టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 వరకు గడువు

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:19 AM

పదో తరగతి వార్షిక పరీక్ష రుసుం తేదీలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రాకుండా ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు రుసుం చెల్లించడానికి గడువును నిర్ణయించారు.

Exams: టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 వరకు గడువు

పదో తరగతి వార్షిక పరీక్ష రుసుం తేదీలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రాకుండా ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు రుసుం చెల్లించడానికి గడువును నిర్ణయించారు. ఆ తర్వాత రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబరు 2వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబరు 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబరు 21వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. ప్రతీ సబ్జెక్టుకు రూ. 125 చొప్పున రుసుం చెల్లించాలి. ఒకేషనల్‌ అభ్యర్థులైతే... అదనంగా మరో రూ. 60లను చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Nov 09 , 2024 | 04:19 AM