Indiramma Houses: మిడ్ మానేర్ నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Nov 18 , 2024 | 03:34 AM
మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 4,696 మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
కిషన్‌రెడ్డి మూసీ నిద్ర.. ఫొటో షూట్: మహేశ్ గౌడ్
హైదరాబాద్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 4,696 మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్టుతో మొత్తం 12 గ్రామాల పరిధిలో 10,683 మంది భూ నిర్వాసితులవ్వగా.. వీరిలో 5,987 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. మిగతా 4,696 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సమ్మతించింది. పథకం కింద ఒక్కో ఇంటి కోసం రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
Updated Date - Nov 18 , 2024 | 03:34 AM