ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాల వడ్డీ తగ్గించండి!

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:45 AM

సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పలు పథకాల కోసం తీసుకున్న నిర్దిష్ట రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవడం(రీస్ట్రక్చరింగ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.

  • రెండు కార్పొరేషన్ల రుణాలు రూ.31,795 కోట్లు

  • వీటిని పునర్వ్యవస్థీకరించాలంటూ కేంద్రానికి రేవంత్‌ సర్కారు వినతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పలు పథకాల కోసం తీసుకున్న నిర్దిష్ట రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవడం(రీస్ట్రక్చరింగ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) కింద అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణాలు తీసుకుంది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి ఇలాంటి రుణాలను సేకరించింది. ఈ రెండు కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.31,795 కోట్ల వరకు ఉన్నాయి. అప్పట్లో 10.75 నుంచి 11.25 శాతం వరకు వడ్డీకి ఈ అప్పులు తీసుకుంది.


ఇంతటి భారీ వడ్డీలను చెల్లించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి తరుణంలో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలను రీస్ట్రక్చర్‌ చేసేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన 16వ ఆర్థిక సంఘాన్ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఈ రుణాల గురించి ప్రస్తావించారు. వీటిని పునర్వ్యవస్థీకరించడానికి రెండు కార్పొరేషన్లను ఒప్పించేలా కేంద్రానికి సూచించాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అర్వింద్‌ పనగారియాను కోరారు.


ఆగస్టులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి సమావేశమైనప్పుడు కూడా ఇదే డిమాండ్‌ను ముందుంచారు. రుణ చెల్లింపుల కాలాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ రుణాలను ప్రభుత్వం కిస్తీల వారీగా చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో రుణానికి 25-48 వరకు కిస్తీలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకేసారి చెల్లించేలా దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని ప్రభుత్వం కోరుతోంది. వడ్డీ శాతాలను సాధ్యమైనంత వరకు తగ్గించేలా ఆ కార్పొరేషన్లను ఒప్పించాలని కేంద్రాన్ని అడుగుతోంది.


  • పునర్వ్యవస్థీకరణ కష్టమే..!

నిజానికి ఆర్బీఐ ద్వారా తీసుకునే మార్కెట్‌ రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవడం అంత సులభం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రుణాల విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒకే సూత్రం ఉంటుందని, పైగా ఈ-వేలం ద్వారా అప్పులు తీసుకుంటుండడంతో వీటిని రీస్ట్రక్చర్‌ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులతో వీటిని ప్రస్తావించాలని సీఎం, డిప్యూటీ సీఎం భావిస్తున్నారు.

Updated Date - Sep 19 , 2024 | 03:45 AM

Advertising
Advertising