Share News

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:09 AM

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో సత్తా చాటిన ఓ యువతి ప్రాజెక్టుకు పేటెంట్‌ హక్కులు లభించాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెంది న కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బిహార్‌లోని పట్నా ఐఐటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది.

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

బీబీనగర్‌, జూన్‌ 15 : జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో సత్తా చాటిన ఓ యువతి ప్రాజెక్టుకు పేటెంట్‌ హక్కులు లభించాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెంది న కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బిహార్‌లోని పట్నా ఐఐటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదివే సమయంలో వృద్ధులు, రైతుల ప్రాణాలు రక్షించే చేతికర్ర పరికరాన్ని ఆవిష్కరించింది. ఇది 2019లో నిర్వహించిన జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఆరో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్‌లో, జపాన్‌లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది. 10 రోజుల క్రితం దీనికి భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులను కల్పించింది.


శ్రావణి తండ్రి పరశురాములు ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి కవిత గృహిణిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రివేళల్లో నడిచేటప్పుడు, పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాముకాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం శ్రావణిని కదిలించి దీన్ని రూపొందించింది. దీని అడుగు భాగంలో ఒక వైబ్రేటర్‌, దానిపైన బజర్‌, టార్చ్‌లైట్‌ను, మధ్యలో బ్యాటరీని అమర్చుతారు. దీన్ని పట్టుకొని అడుగులు వేసినప్పుడు వైబ్రేటర్‌ ఆన్‌ అవుతుంది. కర్ర పెట్టిన స్థలం నుంచి రెండు మీటర్ల విస్తీర్ణంలో ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలకు పాములు, ఇతర విష పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. దీనికి అమర్చిన బజర్‌ సౌండ్‌తో పంట పొలాల్లోకి వచ్చిన అడవి పందులు, పిట్టలు పారిపోతాయి. దీని తయారీకి రూ.2 నుంచి రూ.3 వేలకు మించి ఖర్చవదని శ్రావణి తెలిపింది.


ఎస్సీ గురుకులంలో పదోన్నతులకు లైన్‌క్లియర్‌.!

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ గురుకులంలో ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న సీనియారిటీ, పదోన్నతులకు లైన్‌ క్లియరయింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అర్హులైన ఉద్యోగులకు ఆయా కేటగిరీలో పదోన్నతులు లభించనుండగా అదే సమయంలో బదిలీలు జరగనున్నాయి. పదోన్నతులు, బదిలీలకు అవసరమైన సీనియారిటీ జాబితా ఖరారుకు సంబంధించిన ప్రక్రియను ఎస్సీ గురుకులం ప్రారంభించింది. ఇందులో భాగంగానే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ విభాగాలకు సంబంధించిన 22 కేటగిరీల వారీగా ప్రొవిజినల్‌ సీనియారిటీ లిస్ట్‌ను శనివారం వెబ్‌సైట్‌లో ఉంచింది. కాగా జూన్‌ 19 వరకు అభ్యంతరాల స్వీకరణకు అధికారులు అవకాశం కల్పించారు.

Updated Date - Jun 16 , 2024 | 05:09 AM